సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (11:14 IST)

తెలంగాణలో 166 కేసులు.. 54శాతం మందిలో యాంటీబాడీలు..

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 166 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,99,572కి చేరింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1639కి చేరింది. కరోనా బారి నుంచి గురువారం 149 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,95,970కి చేరింది.
 
మరోవైపు హైదరాబాద్ నగరంలో 54శాతం మందిలో యాంటీబాడీలు తయారైనట్లు గుర్తించామని రాజధాని పరిధిలో సీసీఎంబీ, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌), భారత్‌ బయోటెక్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సీరో అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 
 
హైదరాబాద్‌ నగరంలో సంగం మంది ప్రజలకు కరోనా వచ్చి పోయిందని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సంస్థ తెలిపింది. (సీసీఎంబీ) కరోనా సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడమే దీనికి కారణమని కూడా పేర్కొంది. ఇప్పటివరకు నాలుగు సార్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సీరో అధ్యయనం నిర్వహించామన్నారు. 
 
ఈసారి అత్యధికంగా 150 వార్డులకు గాను 30 వార్డుల నుంచి 9 వేల మందితో అతిపెద్ద సమూహ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. వైరస్‌ ఇంకా మన చుట్టూనే ఉందని, నిర్లక్ష్యం చేస్తే లెక్కలన్నీ మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు.