శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (12:56 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా దూకుడు : మరో 54 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 54 కేసులు నమోదయ్యాయి. మొత్తం 7,320 శాంపిళ్లను పరిశీలించగా, అందులో 54 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 16, చిత్తూరులో 3, గుంటూరులో 1, కృష్ణాలో 6, కర్నూలులో 7, విశాఖపట్నంలో 11, విజయ నగరంలో 1 కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 9 కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,887గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,004గా ఉందని పేర్కొంది. 
 
మరోవైపు, రాష్ట్రంలోని జిల్లాల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురంలో 99, చిత్తూరులో 85, ఈస్ట్ గోదావరిలో 20, గుంటూరులో 374, కడపలో 96, కృష్ణలో 322, కర్నూలులో 547, నెల్లూరులో 96, ప్రకాశంలో 61, శ్రీకాకుళంలో 5, విశాఖపట్టణంలో 57, విజయనగరంలో 4, వెస్ట్ గోదావరిలో 68, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 27 మంది వలస కూలీల కేసులు ఉన్నాయి.