శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (09:23 IST)

అంటార్కిటికాలో తొంగిచూసిన కరోనా.. 58మందికి పాజిటివ్

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చేసింది. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కానీ ప్రపంచమంతా కరోనా వైరస్‌ దెబ్బకు వణికితే ఒక్క ఖండం మాత్రమె ఆ టెన్షన్ లేకుండా ఉంది. అదే అంటార్కిటికా. ఇప్పటి దాకా ఆ ఖండం మీద ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నిజానికి ఈ ఖండంలో శాశ్వతంగా ఎవరూ నివసించరు. కొద్ది మంది పరిశోధకులు, ఇతర సందర్శకులు మాత్రమే అక్కడ ఉంటారు.
 
అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అంటార్కిటికా ఖండంలోనూ మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. అది ఒకటి రెండు కాదు ఏకంగా 58 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిలీ రీసెర్చ్ బేస్ సహా చిలీ ఆర్మీలోని సైనికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్పానిష్ మీడియా కథనాలు వెలువరించింది.
 
ఇక నివారణ చర్యలు చేపట్టామని కూడా చిలీ ఆర్మీ ప్రకటన చేసింది. రీసెర్చ్‌ బేస్‌కు వచ్చిన ఓడలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వారి ద్వారానే ఇది వ్యాపించి ఉండవచ్చని పేర్కోంది. కరోనా కేసులు నమోదు కావడంతో అంటార్కిటికాలోని అన్ని ప్రధాన రీసెర్చ్ ప్రాజెక్టులను నిలిపివేశారు.