గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 మే 2020 (09:33 IST)

ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు కరోనా... 55 లక్షల కేసులు

చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్.. ఇపుడు ఏకంగా 213 దేశాలకు వ్యాపించింది. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య దాదాపు 55 లక్షలకు చేరువయ్యాయి. అలాగే ఈ వైరస్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 3.45 లక్షల మంది ప్రామాలు కోల్పోగా, 23.02 లక్షల మంది కోలుకున్నారు. 
 
ముఖ్యంగా, అగ్రరాజ్యం అమెరికాను ఈ వైరస్ తీవ్రంగా వణికిస్తోంది. ఈ దేశంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అమెరికాలో ఆదివారం మరో 18 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,86,436కు చేరుకన్నాయి. దేశంలో వైరస్‌ సోకిన వారిలో 99,300 మంది మరణించారు. మరో 11,35,434 యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇకపోతే, పాజిటివ్ కేసుల సంఖ్య రష్యా రెండో స్థానంలో ఉండేది. కానీ, ఇపుడు బ్రెజిల్ రష్యాను వెనక్కి నెట్టేసింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు మొత్తం 3.63 లక్షల కేసులు నమోదుకాగా, 22,716 మంది మరణించారు. 1,49,911 మంది కోలుకోగా, మరో 1,90,991 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
మూడో స్థానంలో ఉన్న రష్యాలో కరోనా కేసులు 3,44,481కి పెరిగాయి. దేశంలో ఇప్పటివరకు 3541 మంది మరణించారు. 2,82,852 కేసులతో స్పెయిన్‌, 2,59,559 పాజిటివ్‌ కేసులతో యూకే, 2,29,858 కరోనా కేసులతో యూకే, 2,29,858 కేసులతో ఇటలీ, 1,82,584 కేసులతో ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
 
మరోవైపు, 130 కోట్ల జనాభా వున్న భారత్‌లో ఆదివారం ఒక్క రోజే ఆరు వేలకు పాగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకంటే మొత్తం కేసుల సంఖ్య 1.38 లక్షలకు చేరువైంది. అలాగే, ప్రపంచ దేశాల జాబితాలో భారత్ ఇరాన్‌ను వెనక్కి నెట్టి పదో స్థానంలోకి వచ్చింది.