గుంటూరులో కోవిడ్ మృతి.. వారం రోజుల చికిత్స పొందుతూ..
గుంటూరులో కోవిడ్ మృతి నమోదైంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ కారణంగా బుధవారం రాత్రి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ఓ మహిళ (45) ఈ నెల 20వ తేదీన అనారోగ్యంతో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు.
బాధితురాలైన మహిళకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల పాటు చికిత్స పొందిన ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.