శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శుక్రవారం, 4 జూన్ 2021 (19:10 IST)

ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి: కోవిడ్ కొత్త కేసులు 10, 413

కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 12%కు తగ్గింది. నమూనా పరీక్షలు 85, 311 చేయగా కోవిడ్ పాజిటివ్ 10,413 కేసులు వెలుగుచూసాయి. పాజిటివ్ రేట్ 12% తగ్గింది.
 
మరణాలు 83 సంభవించాయి. అధిక మరణాలు చిత్తూరులో 14 సంభవించాయి. అత్యధిక కేసులు 
తూర్పుగోదావరి జిల్లాలో 2,308 నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి.
కరోనా యాక్టివ్ కేసులు 1,38,912. 17.38 లక్షల కేసుల్లో 15.93 లక్షల మంది రికవర్ అయ్యారు (91.7%). రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది.