సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (15:48 IST)

కరోనా వైరస్ బారినపడని ఖండం ఏది...?

ప్రపంచం కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంది. అనేక దేశాలు ఈ వైరస్ బారినపడి గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే వేలాది మంది మృత్యువాతపడ్డారు. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో, క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. అయితే, కరోనా వైరస్ బారినపడని ఖండమేదైనా ఉందంటే అది ఒక్క అంటార్కటికా మాత్రమే. 
 
అంటార్కటికాలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. అక్క‌డ ప‌లు దేశాల‌కు చెందిన అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌కులు ఉన్నారు. ఎటువంటి ఇన్ఫెక్ష‌న్లు కానీ క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న కేసులు న‌మోదు కాలేదని వెల్లడించారు. 
 
ప్ర‌తి ఏడాది సుమారు వెయ్యి మంది ప‌రిశోధ‌కులు వేర్వేరు దేశాల నుంచి అంటార్కిటికాకు చేరుకుంటారు. ముఖ్యంగా, అంటార్కిటికా వెళ్లే బ్రిటీష్ ప‌రిశోధ‌కులు ఎవ‌రైనా 14 రోజుల‌ క్వారెంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. వేర్వేరు స్టేష‌న్ల‌లో ఉంటున్న వారికి స‌రుకుల స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. 
 
ఒక్క కేసు కూడా నమోదు కాలేదు : చైనా 
క‌రోనా పుట్టిన హుబేయ్‌లో కొత్త కేసులు న‌మోదు కాలేదు. ఆ దేశం తీసుకున్న చ‌ర్య‌ల్లో ఇదో మైలురాయి. బుధ‌వారం దేశీయంగా ఒక్క కరోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని చైనా ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది. 
 
వైర‌స్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌లో ఏ కేసు కూడా రికార్డు కాలేదు. హుబేయ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 67800 కేసులు నమోదు అయ్యాయి.  దాంట్లో 57678 కేసులు కోలుకున్నారు. కేవ‌లం హుబేయ్‌లో మాత్ర‌మే 3130 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 
 
జ‌న‌వ‌రి 23వ తేదీ నుంచి వుహాన్ న‌గ‌రం క్వారెంటైన్‌లో ఉంది. ఆ న‌గ‌రంలో సుమారు కోటిన్న‌ర జ‌నాభా ఉన్న‌ది. ఇక హుబేయ్ ప్రావిన్సులో దాదాపు 4 కోట్ల జ‌నాభా ఉన్న‌ది. హుబేయ్‌లో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్లే చైనావ్యాప్తంగా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చిందని చైనా హెల్త్ అధికారులు వెల్లడించారు.