బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (14:02 IST)

హైదరాబాద్ సిటీలో ఖాకీకి - నూజివీడులో లారీ డ్రైవర్‌కు కరోనా

హైదరాబాద్ నగరంలో కరోనా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు, కృష్ణ జిల్లా నూజివీడులో ఓ లారీ డ్రైవర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో హైదరాబాద్ నగరంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన ఖాకీతో సన్నిహితంగా మిగిలిన పోలీసులతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి క్వారంటైన్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, ఈ వైరస్ బారినపడిన పోలీస్ కానిస్టేబుల్ చిక్కడపల్లి ఠాణాలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈయనను గాంధీ ఆస్పత్రికి తరలించి క్వారంటై్న్‌లో ఉంచారు. 
 
ఇకపోతే, కృష్ణా జిల్లా నూజివీడు లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఇంటి పట్టున ఉండకుండా ఉల్లిపాయల లోడుతో మహారాష్ట్రకు బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. బెల్ తరోడా చెక్ పోస్టు అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ఆ చెక్ పోస్టు వద్ద ఆ లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక ఆంబులెన్స్ ద్వారా మళ్లీ హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.