శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (10:35 IST)

భారత్‌లో 6566 - ప్రపంచ వ్యాప్తంగా 57,89,571 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 57,89,571 పాజిటివ్ కేసులు నమోదైవున్నాయి. 
 
భారత్‌లో ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 194గా ఉంది. ప్ర‌స్తుతం ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన కరోనా వైర‌స్ కేసుల సంఖ్య 1,58,333కు చేరుకుంది. దీంట్లో 86110 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 67692 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531కి చేరుకున్న‌ది. 
 
ఇదిలావుంటే, ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57,89,571 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29,34,521. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరు ప్రపంచవ్యాప్తంగా 3,57,432 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి 24,97,618 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ముఖ్యంగా, అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోయింది. కోవిడ్‌-19తో యూఎస్‌లో ఇప్పటివరకు 1,02,107 మంది చనిపోయారు.