శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (17:11 IST)

కోలీవుడ్ దర్శకుడు - నటుడుకి కరోనా పాజిటివ్

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు సెల్వరాఘవన్‌తో పాటు మరో నటుడు జయరాంకు కరోనా వైరస్ సోకింది. వీరిద్దరూ వేర్వేరుగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. 
 
కాగా, సెల్వరాఘవన్ ఆదివారం ఉదయం ఇదే అశంపై ఓ ట్వీట్ చేసారు. "నేను ఇవాళ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. గత రెండు మూడు రోజుల్లో నన్ను కలిసివారందరూ కరోనా పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్‌లో ఉండాలని కోరుతున్నాను" అని సెల్వరాఘవన్ కోరారు. 
 
అలాగే, నటుడు జయరాం కూడా శనివారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కోవిడ్ సోకిందనీ, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారు. అయితే, తనను కలిసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.