శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (17:37 IST)

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. గత రెండు రోజులుగా ఈ కేసుల పెరుగుదలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. మంగళవారం విడుదల చేసిన ప్రకటన మేరకు 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు పది వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో 4,1713 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఇందులో 10,057 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో 1,827 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, చిత్తూరులో 1,822 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇకపోతే, ఈ కరోనా వైరస్ సోకి 8 మంది చనిపోగా, మరో 1,222 మంది కోలుకున్నారు. అలాగే, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,27,441కు చేరగా, వీరిలో 20,67,984 మంది కోలుకున్నారు. అలాగే, 14522 మంది చనిపోయారు.