తెలంగాణలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు BA.4
మహారాష్ట్రలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు BA.4, BA.5అలజడి రేపుతున్నాయి. ఒమిక్రాన్ రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 73కు చేరుకుందని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ కేసులన్నీ పుణే జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఈ జిల్లాలో గడిచిన రెండు వారాల్లో కొవిడ్ కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల చోటు చేసుకుంది.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
మార్చి నుంచి జూన్ 7 వరకు తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు సగటున 55 నుంచి 65 మధ్య నమోదయ్యాయి. ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ) డేటా తాజా డేటా ప్రకారం తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న పెరుగుదలకు బీఏ కారణమని తేలింది.
బిఎ.2.75 వేరియంట్, దాని బహుళ ఉత్పరివర్తనల కారణంగా, సహజ సంక్రమణ, వ్యాక్సిన్ల ద్వారా వ్యక్తులు పొందిన రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని పొందింది. ఇది కొన్ని వారాల్లో బహుళ పునరావృత అంటువ్యాధులకు దారితీస్తుంది.