గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (11:12 IST)

కరోనా వైరస్ సునామీ : 4.12 లక్షల కేసులు

దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో 3,29,113 మంది కోలుకున్నారు.
 
తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,10,77,410కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 2,30,168 మంది మరణించగా.. 1,72,80,844 మంది కోలుకున్నారు. మరోవైపు, దేశంలో ఇప్పటివరకు 16,25,13,339 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. 
 
మరోవైపు, దేశంలో టీకా డ్రైవ్‌ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 16,24,30,828 డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాల్లో బుధవారం 18-44 ఏళ్లలోపు 2,30,305 మంది లబ్ధిదారులకు మొదటి డోసు వేసినట్లు పేర్కొంది. 
 
ఇప్పటివరకు వారికి 9,02,731 మోతాదులు వేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,24,30,828 మంది లబ్ధిదారులకు టీకాలు వేయగా.. ఇందులో ఆరోగ్య కార్యకర్తల్లో 94,79,901 మందికి మొదటి డోసు.. 63,52,975 మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది.