శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శనివారం, 4 ఏప్రియల్ 2020 (23:02 IST)

ప్లీజ్.. మమ్మల్ని కరోనా రెడ్ జోన్ నుంచి తొలగించండి

కొత్తపేట మార్కెట్ ఏరియాలో ఉన్న రెడ్ జోన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ఆ ప్రాంత వాసులు సామాజిక దూరం పాటిస్తూ అధికారులను మీడియా ద్వారా వేడుకున్నారు. మా మార్కెట్ ప్రాంతాన్ని రెడ్ జోన్ చేయటం వల్ల మా కుటుంబాలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోయారు.
 
మా అందరినీ కూడా జైల్లో బంధించినట్లు పెట్టారని మాకు నిత్యావసర సరుకులు రాక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై జిల్లా అధికారులు మా మార్కెట్ ఏరియా ప్రాంత వాసుల బాధలను అర్ధం చేసుకుని మాకు ఈ బందీఖానా నుండి విముక్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్ప్, ఆర్డఓ, డీఎస్పీలను వేడుకున్నారు.
 
తమ ప్రాంతంలో ఉన్న ఇద్దరికి కరోనా నెగిటివ్ వచ్చి వారిని తిరిగి కొత్తపేట స్వగృహానికి తీసుకువచ్చిన తరువాత కూడా ఈ రెడ్ జోన్ ఎందుకని వారు ఆవేదన వ్యక్తం చేశారు.