మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:17 IST)

ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు.. 24 గంటల్లో 97 మంది మృతి

ఏపీలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి.

24 గంటల్లో అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగగా ఇప్పటి వరకు 2,73,085 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,475కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27,58,485 మందికి కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 53,026 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఎపిలో 89,907 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ రోజు బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆర్డీఓ ఖాజావలి ప్రకటించారు. బందరు పట్టణ పరిధిలో 31, మండల పరిధిలో 4,  కేసు నమోదయినట్లు, డివిజను పరిధిలో 20 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిన్న ప్రకటించిన కేసులలో  5 కేసులు ఇచ్చిన అడ్రెసు లో నివసించని కారణంగా ఆకేసును లెక్కలోనుంచి తీసినట్లు తెలిపారు. దీనితో డివిజను మొత్తంలో 1140 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆర్డీఓ తెలిపారు.