సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (11:51 IST)

తితిదేలో అర్చకులకు కరోనా పాజిటివ్?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఏడుగురు అర్చకులకు కరోనా వైరస్ సోకింది. ఈ ఏడుగురుతో కలుపుకుని కరోనా వైరస్ బారినపడిన మొత్తం అర్చకుల సంఖ్య 15కు చేరింది. 
 
తాజాగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన అర్చకులను శ్రీనివాసం క్వారంటైన్‌కు తరలించారు. ఈ అర్చకులు ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారు. ఎంతమందిని కలిసారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.
 
మరోవైపు, విషయం తెలుసుకున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... అత్యవసరంగా తితిదే అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల గిరుల్లో కరోనా తీవ్రతపై వారు చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 
 
కాగా, తితిదేలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. ఈ సిబ్బంది సంఖ్య వందకుపైగానే ఉంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఇపుడు అర్చకులకు కూడా వైరస్ సోకిందన్న సమాచారంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.