మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (17:35 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న మరణమృదంగం

తర్వాతి స్థానాల్లో చిత్తూరు 963, విశాఖపట్నం 931, అనంతపురం 856, పశ్చిమగోదావరి 853, కర్నూలు 823 ఉన్నాయి. మరోవైపు గత 24 గంటల్లో 9,499 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరుకున్నాయి. మొత్తం మరణాలు 2378గా నమోదయ్యాయి. 
 
మరోవైపు, దేశంలో కరోనా ఉద్ధృతి, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. భారత్‌లో 24 గంటల్లో 66,999 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 942 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 23,96,638కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 47,033 కి పెరిగింది. 6,53,622 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 16,95,982 మంది కోలుకున్నారు