1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జులై 2020 (10:36 IST)

వరంగల్ జిల్లాలో కరోనా విజృంభణ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 977కు చేరింది. కరోనాతో 13 మంది మృతి చెందారు. వారంలోనే కరోనా కేసులు రెట్టింపయ్యాయి. వరంగల్ అర్బన్ లోనే 418 కేసులు నమోదయ్యాయి. వరంగల్ ట్రై సిటీస్‌లో 13 ప్రాంతాలను కంటైన్మైంట్  జోన్‌లుగా ప్రకటించారు. కరోనా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు కరోనా పరీక్షలకు ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ పరారైన ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. హన్మకొండ సుబేదారికి చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి పరార‌య్యాడు.
 
దీంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో జైలు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఖైదీ అత‌డి కోసం గాలిస్తున్నారు. ఇక 14 చోరీలు చేసిన ఖైసర్‌ గత నెలలోనే పట్టుబడ్డాడు. ఈ కేసుల్లో ప్ర‌స్తుతం అత‌డు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ ప్రస్తుతం అతడు పారిపోవడంతో అతనిని వెతికి పట్టుకునే పనిలో వున్నారు పోలీసులు.