మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (15:59 IST)

Ajaz Patel ఒక్కడు... భారత్‌లో పుట్టి న్యూజీలాండ్ బౌలర్‌గా టీమిండియా 10 వికెట్లు టపటపా

న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా శనివారం రికార్డు సృష్టించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌పై జరుగుతున్న రెండో టెస్టులో అతను ఈ ఫీట్ సాధించాడు.
 
 
పటేల్ 119 పరుగులిచ్చి ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా, భారతదేశం మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. అజాజ్ తన పదవ వికెట్‌ను తీయగానే, రవిచంద్రన్ అశ్విన్ కూడా కివీస్ స్పిన్నర్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడానికి లేచి నిలబడి, అద్భుతమైన ఫీట్‌ను గుర్తించాడు.

 
అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన జిమ్ లేకర్ 1956లో టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్ గా నిలువగా, ఆ తర్వాత 1999లో పాకిస్థాన్‌పై భారత ఆటగాడు అనిల్ కుంబ్లే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పుడు న్యూజీలాండ్ ఆటగాడు రికార్డు సృష్టించాడు.