శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (11:54 IST)

వన్డే ప్రపంచ కప్ గెలిచే జట్టు ఏదో తెలుసా? రికీ పాంటింగ్

ప్రపంచ కప్ పోటీలు ఇంకా రెండు నెలల్లో జరుగనున్నాయి. ఈ ప్రపంచ కప్ పోటీల్లో ట్రోఫీని గెలుచుకునే సత్తా ఎవరికి వుందో అనే అంశంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 2003, 2007, 2011ల్లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో ఆస్ట్రేలియా రెండు సార్లు ప్రపంచ కప్ గెలుచుకుందన్నాడు.


అయితే ఈసారి టీమిండియా జట్టుకు ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు పుష్కలంగా వున్నాయని.. అలాగే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఫామ్‌లో వున్నాయని రికీ చెప్పుకొచ్చాడు. 
 
తాను ఆస్ట్రేలియా జట్టుకు సహ కోచ్‌గా వ్యవహరిస్తున్నందున ఈ విషయం చెప్పలేదని.. సొంతగడ్డపై ఇంగ్లండ్ రాణించే అవకాశం వుందని.. అలాగే ఆస్ట్రేలియాకు కూడా ఇంగ్లండ్ పిచ్ అనుకూలిస్తుందని పాంటింగ్ తెలిపాడు. 
 
ఇంగ్లండ్ పిచ్‌ కంగారూలతో పాటు, ఇంగ్లీష్ క్రికెటర్ల బ్యాటింగ్‌కు సానుకూలంగా వుంటుందని రికీ వ్యాఖ్యానించాడు. అలాగే ఆస్ట్రేలియా జట్టులోకి డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వస్తే.. జట్టుకు ఊతమిస్తుందని రికీ చెప్పాడు. గత 2015వ సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ట్రోఫీని గెలుచుకుని ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.