మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (18:08 IST)

రాజ్యసభకు హర్యానా హరికేన్‌.. రాష్ట్రపతి కోటాలో...

భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ కాగా, ఈయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. ఇపుడు రాష్ట్రపతి కోటాలో కపిల్ దేవ్‌తో

భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ కాగా, ఈయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. ఇపుడు రాష్ట్రపతి కోటాలో కపిల్ దేవ్‌తో పాటు.. సినీ నటి మాధూరీ దీక్షిత్‌లను పెద్దల సభకు పంపాలని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.
 
నిజానికి కపిల్ దేవ్ ఓ క్రికెట్ లెజెండ్. మిస్టర్ కూల్ కెప్టెన్. దేశానికి తొలి క్రికెట్ ప్రపంచ కప్‌ను అందించిన సారథి. తన పని తాను చేసుకుపోతూ.. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే వ్యక్తి. ఇప్పటివరకు ఏ పార్టీకి సపోర్ట్ ప్రకటించలేదు. కానీ, పరోక్షంగా మాత్రం బీజేపీకి సపోర్ట్ చేయనున్నట్లు జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయి. 
 
ఇందుకు బలం చేకూర్చుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. స్వయంగా తానే కపిల్ దేవ్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. సుమారు గంటసేపు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు సెలబ్రిటీలను కలుస్తూ ఉన్నారు. 
 
ఇందులో భాగంగానే కపిల్‌తోనూ భేటీ అయినా.. ఆయన్ను మాత్రం రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. మోడీకి మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రపతి నామినేటెడ్ చేసే రాజ్యసభ్య సభ్యుల జాబితాలో కపిల్ దేవ్‌కు చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది. 
 
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే కపిల్ దేవ్‌తో ప్రమాణస్వీకారం చేయించాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు అమిత్ షా కూడా హామీ ఇచ్చినట్లు జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రపతి నామినేటెడ్ చేసే రాజ్యసభ ఎంపీల్లో కపిల్ దేవ్ ఎంపిక అయినా.. పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే కదా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.