బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (19:36 IST)

బర్త్ డే... రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్.. కారణం ఏంటో తెలుసా?

dinesh karthik
వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తిక్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్నీ ఫార్మాట్‌లకు బైబై చెప్పేశాడు. తనలో క్రికెట్ ఆడగలిగే ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ దినేష్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇకపై కామెంటేటర్‌గానే ప్రేక్షకులను పలకరించనున్నాడు. 
 
తన రిటైర్మెంట్ గురించి దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ పరంగా మరో మూడేళ్ల పాటు క్రికెట్ ఆడగలను. కానీ మానసికంగా మాత్రం ఫిట్‌గా లేని సందర్భాలున్న కారణాలతో.. మైదానంలో దిగలేకపోతున్నాను. బయటి వారికి ఇవేవీ తెలియకపోవచ్చు. 
 
కానీ, ఓ క్రికెటర్‌కు అర్థమవుతుందని దినేష్ కార్తీక్ తెలిపాడు. బరిలోకి దిగినా వంద శాతం నిబద్ధతతో ఆడేందుకు ప్రయత్నిస్తాను.. కానీ రిటైర్మెంట్ ప్రకటించేశాను. భవిష్యత్తులో భారత జట్టుకే ఆడే అవకాశాలు రావడం అసాధ్యం. ఐపీఎల్ మాత్రమే ఆడబోతున్నాను. 
 
మానసికంగా ఫిట్‌గా లేనప్పుడు జట్టుకు భారం కావడం తప్ప ఉపయోగం ఉండదు. బాగా ఆడలేకపోతున్నా జట్టులో ఉన్నామనే గిల్టీ ఫీలింగ్ వెంటాడుతుంటుంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే నేను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా... దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చింది.