స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చూస్తే నవ్వుకుంటారు.. (వీడియో)

Last Updated: శనివారం, 17 ఆగస్టు 2019 (15:10 IST)
ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి పరుగుల పరంగా కాకుండా  ఫన్నీ బ్యాటింగ్ శైలితో నవ్వులు పూయించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో యాషెస్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ బౌలర్లు విసిరిన చెత్త బంతులను ఆడే క్రమంలో స్మిత్‌ వాటిని మిస్ చేస్తూ వినోదం పంచాడు. 
 
ఇందుకు సంబంధించిన వీడియోలను అభిమానులు ట్విటర్‌లో పోస్టు చేస్తూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన రెండో టెస్టు మూడో రోజు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ విచిత్ర బ్యాటింగ్‌ చోటుచేసుకుంది. 
 
వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దైన మ్యాచ్‌లో గురువారం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. శుక్రవారం మూడో రోజు కూడా వర్షం కురవడంతో కేవలం 24.1 ఓవర్ల పాటు మాత్రమే ఆట కొనసాగింది. దీనిపై మరింత చదవండి :