శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2019 (11:10 IST)

16న టీమిండియా కొత్త కోచ్ ఎంపిక

టీమిండియా కోచ్ ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతోంది. ప్రస్తుత కోచ్ రవిశాస్తి పదవి కాలం ముగియడంతో కొత్త కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ ఇంటర్వ్యూలకు సిద్ధమైంది. దీని కోసం 2 వేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. కపిల్‌దేవ్‌, అన్షుమన్ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ భారత ప్రధాన కోచ్ ఎంపికను శుక్రవారం (ఆగస్టు-16) చేపట్టనుంది. అదే రోజు కొత్త కోచ్ ఎవరనేది తేలిపోనుంది. 
 
ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ సహా పలువురిని ఇంటర్వ్యూకు బీసీసీఐ ఆహ్వానించింది.ఇప్పటికే రవిశాస్త్రికి కెప్టెన్ కోహ్లీ మద్దతు పలుకుతున్నారు.
 
ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ముంబైకి రాలేని వాళ్లు స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చని బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.