శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (16:40 IST)

భారత కుర్రోళ్లు గెలవలేదు.. టీమిండియాను అంపైర్లు గెలిపించారు : ఇయాన్ మోర్గాన్

నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో రాణించి గెలవలేదనీ, ఈ మ్యాచ్‌ అంపైర్లు ఇచ్చిన తప్పుడు నిర్ణయాలతో గెలిచారని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆరోపించారు

నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో రాణించి గెలవలేదనీ, ఈ మ్యాచ్‌ అంపైర్లు ఇచ్చిన తప్పుడు నిర్ణయాలతో గెలిచారని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆరోపించారు. మ్యాచ్‌ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అంపైర్‌ షంసుద్దీన్‌ వివాదాస్పద అంపైరింగ్‌ వల్ల అప్పటివరకు తమకు అనుకూలంగా ఉన్న మ్యాచ్‌ ఫలితం భారత్‌వైపు మళ్లిందన్నాడు. 
 
ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఐదు పరుగుల తేడాతో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. దీనిపై ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందిస్తూ టీమిండియాతో జరిగిన రెండో టీ20లో అంపైర్‌ తప్పుడు నిర్ణయం వల్లే తాము ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. 
 
మ్యాచ్‌ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అంపైర్‌ షంసుద్దీన్‌ వివాదాస్పద అంపైరింగ్‌ వల్ల అప్పటివరకు తమకు అనుకూలంగా ఉన్న మ్యాచ్‌ ఫలితం భారత్‌వైపు మళ్లిందన్నాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో బుమ్రా వేసిన తొలి బంతికి జో రూట్‌ ఎల్బీగా అవుటవుతాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకినట్లు రీప్లేలో తేలింది. రూట్‌ అవుటయ్యే సమయానికి 38 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 
 
తప్పుడు నిర్ణయం వల్ల అనూహ్యంగా అతడు క్రీజు నుంచి వెనుదిరగడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ కుదురుకోవడానికి సమయం పట్టిందని దీంతో విజయం భారత్‌ను వరించిందని అన్నాడు. అలాగే, భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లి విషయంలోనూ ఫలితం ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వచ్చిందన్నాడు. క్రిస్‌ జోర్డాన్‌ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చినప్పటికీ షంషుద్దీన్‌ నాటౌట్‌ ప్రకటించాడని మోర్గాన్‌ తెలిపాడు.