గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (15:55 IST)

బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్‌ ఇలాక్‌తో పాండ్యా మాజీ భార్య చక్కర్లు!!

natasha  new boyfriend
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ముంబై వీధుల్లో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చక్కర్లు కొడుతున్నారు. పాండ్యాతో తెగదెంపులు చేసుకున్న తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన ఆమె.. దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి ముంబైకు చేరుకున్నారు. తన కుమారుడిని మాజీ భర్తకు అప్పగించిన ఆమె ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నారు. ఇక్కడ తన బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్‌తో కలిసి వీధుల్లో విహరిస్తున్నారు. ఈ ప్రేమపక్షులో ముంబై వీధుల్లో తిరిగిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు రంగు జాకెట్ ధరించిన నటాషా.. ఓ జిమ్ వద్ద ఫోటోగ్రాఫర్లకు ఫోజులివ్వడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. 
 
కాగా, హార్దిక్, న‌టాషా ఇటీవ‌లే విడిపోయిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాంతో ఆమె త‌న కుమారుడు అగ‌స్త్య పాండ్యాను తీసుకుని సెర్బియా వెళ్లిపోయారు. రెండు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఇండియాకు తిరిగి వ‌చ్చారు. కాగా, స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం హార్దిక్‌ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే న‌టాషా అత‌ని నుంచి దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అదేసమయంలో తన బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్‌కు ఆమె దగ్గరయ్యారు.