గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (09:12 IST)

ఐపీఎల్ 2024 : చెన్నై కింగ్స్ శుభారంభం.. తేలిపోయిన ఆర్సీబీ

Chennai Super Kings
ఐపీఎల్ 2024 సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో చెన్నై వేదికగా జరిగిన సీజన్ ఓపెనర్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. 
 
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసి గెలుపొందింది. రచిన్ రవీంద్ర (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), శివమ్ దూబే(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్), రవీంద్ర జడేజా(17 బంతుల్లో సిక్స్‌తో 25 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో కామెరూన్ గ్రీన్(2/27) రెండు వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మ, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు.
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ ఆటగాళ్లలో యువ వికెట్ కీపర్ అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), వెటరన్ కీపర్ దినేశ్ కార్తీక్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 95 పరుగులు జోడించారు.