వెస్టిండీస్ పర్యటన నుంచి రోహిత్‌ను ఎందుకు తొలగించారు?
వెస్టిండీస్ పర్యటన నుంచి ఓపెనర్ రోహిత్ శర్మను తొలగించారు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేని సమయంలో రోహిత్ శర్మ జట్టు సారథ్యలను స్వీకరించి, జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ముఖ్యంగా, ట్వంటీ20, వన్డే ఫార్మెట్‌లలో అద్భుతమైన రికార్డుతో సారథ్య ట్రాక్ రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ శర్మను తొలుత వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసి ఇపుడు ఈ పర్యట నుంచి తప్పించడంతో కెప్టెన్ కోహ్లీ - రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం చెప్పకనే చెబుతున్నాయి.
అయితే, ఈ పర్యటన నుంచి రోహిత్ శర్మను తప్పించడానికి గల కారణాలను విశ్లేషిస్తే, ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భారత ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయంలో కోహ్లీ - రోహిత్‌ల వాగ్వాదం జరిగినట్టు సమాచారం.
అలాగే, ప్రపంచ కప్ ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలన భావించిన కోహ్లీ... తన నిర్ణయాన్ని మార్చుకుని వెస్టిండీస్ పర్యటనకు సిద్ధపడటం కూడా రోహితకు నచ్చలేదు. ఈ కారణంగానే రోహిత్ శర్మ టీ20లకు దూరం కావడానికి ఇది కూడా ఓ కారణం. అలాగే, జట్టు ఎంపికపై రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేయడం కోహ్లీపై నిందలు వేయడం వివాదాలకు దారి తీసినట్లుగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ జట్టుకు దూరంకావడం వెనుక పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే దూరమయ్యాడా? విశ్రాంతి కోసమే రోహిత్ ఈ పర్యటనకు దూరంగా ఉండాలని భావించాడా? అన్నది తేలాల్సివుంది. కోహ్లీనే టీ20లకు అవసర్లేదని దూరం చేశాడా.. ఇదే అదనుగా రోహిత్‌ను నిదానంగా జట్టుకు దూరం చేయనున్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.
వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన వారం రోజులకు గుమ్మడికాయ దొంగ అన్నట్లు కోహ్లీ మీడియాతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగానే ఉంది. మా మధ్య ఫ్రెండ్లీ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు. అదే నిజమైతే కోహ్లీ, రోహిత్‌ల మధ్య సోషల్ మీడియాలో పరోక్ష యుద్ధం కనిపించదు. ఇపుడు రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడం కూడా సరికొత్త చర్చకు దారితీసింది.