శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (17:52 IST)

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ ఛేంజ్.. ఒప్పో స్థానంలో బైజూస్

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ మారనుంది. ఒప్పో స్థానంలో ప్రముఖ ఈ-లెర్నింగ్ యాప్ ''బైజూస్'' దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికా పర్యటన నుంచి 2022, సెప్టెంబర్ వరకూ బైజూస్ కాంట్రాక్టు కొనసాగుతుందని బీసీసీఐ వర్గాల సమాచారం. ఇందుకోసం  రూ.1,079 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. 
 
2017, మార్చిలో ఒప్పో బీసీసీఐతో రూ.1,079 కోట్లతో ఒప్పందం చేసుకుంది. దీనిప్రకారం టీమిండియా ఆడే ద్వైపాక్షిక మ్యాచ్‌లకు ఒప్పో సంస్థ ఒక్క రోజుకు రూ 4.61 కోట్లు చెల్లించగా ఐసీసీ ఈవెంట్లకు రూ.1.56 కోట్లు చెల్లించేది.
 
అయితే 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామన్న కారణంతో ఈ డీల్ నుంచి ఒప్పో తప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒప్పో స్థానంలో అంతే మొత్తానికి బైజూస్ స్పాన్సర్ చేసేందుకు ముందుకొచ్చిందని బీసీసీఐ వర్గాల సమాచారం.