శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (12:08 IST)

రిషబ్ పంత్ మరో ధోనీ కావాలి : ఎంఎస్కే ప్రసాద్ ఆకాంక్ష

భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ మరో ధోనీ కావాలని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ నెల 23వ తేదీ నుంచి భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం ట్వంటీ20, వన్డే, టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఇందులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. 
 
దీనిపై ఎంఎస్కే ప్రసాద్ స్పందిస్తూ, రిషబ్ పంత్‌ను మూడు ఫార్మెట్లకు ఎంపిక చేసినట్టు చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పంత్‌ను సెలెక్ట్ చేశామని... వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలను నిర్వహించడం సవాళ్లతో కూడుకున్న అంశమన్నారు. 
 
తన వర్క్‌లోడ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ, పంత్ ఎదగాలని కోరాడు. ముఖ్యంగా, ధోనీ స్థానాన్న భర్తీ చేసే విధంగా పంత్ ఎదగాలని చెప్పాడు. ఈ సిరీస్‌కు ధోనీ అందుబాటులో లేడని తెలిపాడు. ప్రపంచ కప్ వరకు తమకు కొన్ని రోడ్ మ్యాప్స్ ఉన్నాయని... ప్రస్తుత పరిస్థితుల్లో పంత్‌ను సానపట్టడమే తమ లక్ష్యమని ఎంఎస్కే ప్రసాద్ వివరించాడు.