సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (15:54 IST)

షమీపై భార్య కేసు.. వీసా ఇచ్చేందుకు అమెరికా నో.. చివరికి?

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీకి అమెరికా సర్కారు వీసాను తిరస్కరించింది. 2018వ సంవత్సరంలో షమీ భార్య హాసిన్ జహాన్ అతనిపై గృహహింస కేసు పెట్టింది. జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు షమీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఇప్పటికీ షమీపై కేసు విచారణలో ఉంది. ఇంకా పోలీసుల రికార్డుల్లో కేసులు విచారణలో ఉన్నందున అమెరికా ఎంబీసీ వీసా ఇచ్చేందుకు అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యవహారంలో బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో షమీకి చివరకు వీసా జారీ అయినట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే.. విండీస్ పర్యటనకు వెళ్లేందుకు ష‌మీ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే ముంబైలోని అమెరికా ఎంబీసీ ష‌మీకి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ బీసీసీఐ చీఫ్ రాహుల్ జోహ్రీ స్పందించి అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ష‌మీ దేశానికి ఎంతో సేవ చేశాడ‌ని, అత్యుత్త‌మ బౌల‌ర్ అని అమెరికా ఎంబ‌సీకి వెల్ల‌డించారు.