India beat West Indies: 140 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ను టీమిండియా సొంతం చేసుకుంది. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్.. నేటికి పూర్తయింది. ఈ తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు దుమ్ము దులిపేశారు. కేవలం మూడే రోజుల్లో మ్యాచ్‌ను ఫినిష్ చేసేశారు. ఏకంగా 140 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో టీమిండియా 1-0 తేడాతో ముందువరుసలో ఉంది.
విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు స్టంప్స్ సమయానికి భారత్ 448 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆటలో విండీస్ బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 104, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ తర్వాత రవీంద్ర జడేజా కూడా సెంచరీ సాధించడంతో, ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు శతకాలు నమోదు చేసిన అరుదైన రికార్డు నమోదైంది.