1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (10:50 IST)

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : టీమిండియా ప్రాపబుల్స్‌ జాబితా ఇదే...

bcci
ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు సమయం సమీపిస్తుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా తరపున పాల్గొనే 20 మంది ప్రాపబుల్స్ జాబితాను సిద్ధం చేసింది. ఇందులో గతంలో ఐపీఎల్‌లో వారి ప్రదర్శనను పురస్కరించుకుని ఆటగాళ్ల ఎంపిక చేసినట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. 'ఎటువంటి ప్రయోగాలు, ఆశ్చర్యాలు ఉండవు. భారత్ తరపున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన వారికి ఐపీఎల్లో నిలకడ రివార్డుగా ఉండొచ్చు' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్టు వివరించాయి.
 
మొదటి వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అందుబాటులోకి రావడంతో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్ పోటీ పడుతున్నారు. అయితే జితేశ్ శర్మ రేసులో వెనుకబడినట్టే. ఐపీఎల్‌కు ముందు టీమిండియా టీ20 జట్టు ఫస్ట్-ఛాయిస్ వికెట్ కీపర్ జితేశ్ కొనసాగినప్పటికీ ప్రస్తుతం అతడిని ఎంపిక చేసే అవకాశాలు కనిపించడంలేదని పీటీఐ రిపోర్ట్ పేర్కొంది.
 
ఇకపోతే శుభమన్ గిల్, గిల్, యశస్వి జైస్వాల్ మధ్య పోటీ నెలకొనే సూచనలు ఉన్నాయి. స్పిన్నర్ల విషయంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు మొదటి రెండు ఆప్షన్లుగా ఉన్నారు. మూడో స్పిన్నర్‌పై సెలక్టర్లు చర్చించే అవకాశం కనిపిస్తోంది. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్‌తో అక్షర్ పటేల్ పోటీ పడే అవకాశాలున్నాయి. కాగా హార్ధిక్ పాండ్యా పేరు ఎక్కడా వినిపించడం లేదు. అతడికి జట్టులో చోటు దక్కే అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్టేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
 
బీసీసీఐ రూపొందించిన 20 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్ అంచనా జాబితా..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, జస్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.