కంగారూల చేతిలో ఓడినా.. కోహ్లీ రికార్డ్ అదిరిపోయింది..(Video)
ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య గడ్డపై కంగారూలు విజయభేరి మోగించారు. తొలి ట్వంటీ-20 క్రికెట్‌లో భారత్ ఓడిపోయినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తన ఖాతాలో కొత్త రికార్డును వేసుకున్నాడు. ఆదివారం వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్ ద్వారా కోహ్లీ ఆసీస్‌పై మొత్తం 500 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు.
వైజాగ్ మ్యాచ్‌లో కోహ్లీ 17 బంతుల్లో 24 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దకు చేరుకోగానే ఆసీస్‌పై మొత్తం 500 పరుగులు సాధించాడు కోహ్లీ. కాగా.. అంతర్జాతీయ టి20 పోటీల్లో ఆసీస్‌పై ఇప్పటివరకు ఎవరూ 500 పరుగులు చేయలేదు.
ఆస్ట్రేలియాపై ట్వంటీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జేపీ డుమినీ పేరిట వుంది. డుమినీ ఆస్ట్రేలియా జట్టుపై 15 మ్యాచ్ లాడి 378 పరుగులు చేశాడు. కోహ్లీ 14 మ్యాచ్‌లలోనే 500 పరుగులు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
కాగా.. ఆస్ట్రేలియాతో తొలి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు సాధించి గెలుపును నమోదు చేసుకుంది. చివరి ఓవర్లో కంగారూల గెలుపునకు 14 పరుగులు అవసరం కాగా కమ్మిన్స్, రిచర్డ్సన్ జోడీ చెరో ఫోర్ కొట్టి మ్యాచ్ గెలుపును నిర్ణయించారు.
తొలుత భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రాహుల్ చలవతో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. తదనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ డార్సీ షార్ట్ 37, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 56 పరుగులు సాధించడంతో ఆస్ట్రేలియా సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. వీడియో...