సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (20:10 IST)

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ హైలైట్స్.. రికార్డులు.. ప్రశంసలు.. రేటింగ్!

Kohli
Kohli
ప్రపంచ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్‌ను ఓసారి పరిశీలిస్తే.. 
 
ఈ మ్యాచ్‌ల విరాట్ కోహ్లీ తన అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 95 పరుగులు చేసిన కోహ్లీ మ్యాచ్ చివర్లో ఔటయ్యాడు. దీనిపై మాజీ బ్యాటింగ్ దిగ్గజం యువరాజ్ సింగ్ స్పందిస్తూ కోహ్లీపై ప్రశంసలు వర్షం కురిపించాడు.
 
కోహ్లీ సెంచరీ చేయలేకపోయినా, దానికన్నా ఇది అత్యంత విలువైన ఇన్నింగ్స్ అని చెప్పాడు. ఒత్తిడిని జయించి చివరి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లడం గ్రేట్ అని కొనియాడాడు. అందుకే కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పాడు.
 
‘కింగ్’ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌పై శతకం త్రుటిలో తప్పింది. వ్యక్తిగత స్కోరు 95 పరుగుల వద్ద విరాట్ ఔటయ్యాడు. దీంతో సెంచరీ చేజారినట్టయ్యింది. 
 
ఈ సెంచరీ చేసి ఉంటే ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన 49 సెంచరీల రికార్డును సరిసమానం చేసేవాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. దీంతో విరాట్ కోహ్లీ 90 నుంచి 99 పరుగుల వద్ద ఎన్నిసార్లు ఔటయ్యాడనేది ఆసక్తికరంగా మారింది.
 
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టెస్టులు, వన్డేలు, టీ-20లు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 8 సార్లు 90ల్లో ఔటయ్యాడు. వన్డేల్లో 6 సార్లు, టెస్టుల్లో 2 సార్లు 90 నుంచి 99 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడని గణాంకాలు చెబుతున్నాయి. 
 
మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటికి 78 సెంచరీలు కొట్టిగా 90ల్లో ఔటయిన 8 సందర్భాలు కూడా సెంచరీలుగా మలచివుంటే కోహ్లీ ఇప్పటికి 86 సెంచరీలు పూర్తి చేసుకొని ఉండేవాడు. పలు రికార్డులు సాధించి ఉండేవాడు.
 
ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అవుట్ ఫీల్డ్ మరోసారి చర్చనీయాంశమైంది. అవుట్‌ఫీల్డ్‌ ప్రమాదకరంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలపై టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చురకలు అంటించాడు.
shami
 
భారత్‌‌లో 'ఫాగ్' నడుస్తోంది. ఇంగ్లండ్‌లో 'బర్నాల్' నడుస్తోంది. వీటన్నింటికంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల హవా ఎక్కువగా  కొనసాగుతోంది.. అంటూ ఎక్స్‌ వేదికగా సెహ్వాగ్ స్పందించాడు.  
 
ధర్మశాలలో టీమిండియా సాధికారికంగా గెలవడం పట్ల ఇంగ్లండ్ కడుపు మంటతో రగిలిపోతుంటుందని వ్యంగ్యంగా చెప్పేందుకు బర్నాల్ (కాలిన గాయాలకు పూసే మందు) పేరును ఉపయోగించి సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.  
 
ఇకపోతే కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన మొహమ్మద్ షమీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా వన్డే ప్రపంచ కప్‌లలో ఐదు వికెట్లను రెండు సార్లు పడగొట్టిన తొలి ఇండియన్ బౌలర్‌గా ఘనత సాధించాడు. మ్యాచ్ తర్వాత షమీ మట్లాడుతూ, ఏ ఆటగాడికైనా తుది జట్టు 11 మందిలో చోటు దక్కకపోతే గిల్టీగా ఫీల్ కాకూడదని చెప్పాడు.  
 
ప్రపంచకప్‌లో భాగంగా గతరాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో విజయం సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. విజయం తర్వాత డ్రెస్సింగ్ రూంలో జట్టు సరదాగా గడిపింది. ‘ఉత్తమ ఫీల్డర్’ అవార్డు వేడుక సందర్భంగా ఉల్లాసంగా గడిపారు.  
 
ధర్మశాల మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయాస్ అయ్యర్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు లభించింది. ఈ మొత్తం వేడుకను రికార్డు చేసిన బీసీసీఐ దానిని తమ వెబ్‌సైట్‌లో పంచుకుంది.
 
మరోవైపు సాధారణంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌‌లకు విపరీతమైన ఆదరణ ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ఆదివారం రాత్రి న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో వీక్షించారని డిస్నీ హాట్‌స్టార్ గణాంకాలు చెప్పాయి. 
 
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఒకేసారి 3.2 కోట్ల మంది వీక్షించడం రికార్డుగా నిలవగా, ఆ రికార్డు ప్రస్తుతం గాలిలో కలిసిపోయింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ను ఒకేసారి ఏకంగా 4.3 కోట్ల మంది డిస్నీ హాట్‌స్టార్‌ వేదికపై వీక్షించారు. 
 
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో వ్యూయర్స్ సంఖ్య 4 కోట్లు దాటింది. క్రమంగా ఈ సంఖ్య 4.3 కోట్లు అధిగమించిందని డిస్నీ హాట్‌స్టార్‌ ప్రకటించింది. దసరా సెలవులు, అందులోనూ ఆదివారం కావడంతో ఈ స్థాయి వ్యూయర్ షిప్ పెరిగేందుకు కారణమైంది.