శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

సౌతాఫ్రికాకు వన్డే టీమ్ సెలక్షన్ : షమీకి పిలుపు.. రాహుల్ ఔట్

భారత క్రికెట్ జట్టు ఈనెలాఖరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులోభాగంగా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ వన్డే జట్టును ప్రకటించింద

భారత క్రికెట్ జట్టు ఈనెలాఖరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులోభాగంగా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ వన్డే జట్టును ప్రకటించింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు చోటుకల్పించారు. 
 
శ్రీలంకతో తలపడిన జట్టులో పెద్దగా మార్పులు చేయకుండానే వీరిద్దరికీ చోటు కల్పించారు. కాగా, వాషింగ్టన్ సుందర్, సిద్ధార్థ కౌల్‌లకు ఉద్వాసన తప్పలేదు. ఈ యేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో షమీ, ఆగస్టు-సెప్టెంబరులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో శార్దూల్ చివరిసారి ఆడారు.
 
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, అజింక్యా రహానే ఓపెనర్లుగా వ్యవహరించనుండగా శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. గాయంతో బాధపడుతూ వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన కేదార్ జాదవ్ తిరిగి జట్టులోకి తీసుకున్నారు. 
 
కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌తు పరమ చెత్త రికార్డు ఉంది. దక్షిణాఫ్రికాలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు 28 సార్లు తలపడగా భారత్ కేవలం ఐదుసార్లు మాత్రమే విజయం సాధించింది. 21 సార్లు ఓటమి పాలైంది. తాజా సిరీస్‌లో భారత్ మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జనవరి 5న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
 
భారతజట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, అజింక్యా రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్.