శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (07:39 IST)

విశాఖలో ధావన్ ధమాకా.. సిరీస్ కైవసం భారత్ వశం (హైలైట్స్ వీడియో)

విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా సొంతగడ్డపై తమకు ఎదురులేదని భారత్ మరోమారు నిరూపించింది. దీంతో వన్డేల్లో వరుసగా 8 సిరీస్ విజయాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. 
 
ఆదివారం శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో రోహిత్‌సేన 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్.. శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్పిన్ ద్వయం చాహల్ (3/46), కుల్దీప్‌యాదవ్(3/42) ధాటికి లంక 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఉపుల్ తరంగ(95) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. 
 
ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. ధవన్(85 బంతుల్లో 100 నాటౌట్, 13 ఫోర్లు, 2సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు శ్రేయాస్ అయ్యర్(63 బంతుల్లో 65, 8 ఫోర్లు, సిక్స్) అర్థసెంచరీతో 32.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ధనంజయ (1/53), పెరెర(1/25) ఒక్కో వికెట్ తీశారు. మూడు వికెట్లతో లంకను స్వల్ప స్కోరుకు పరిమితం చేసిని కుల్దీప్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కగా, ధవన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌'గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఈనెల 20న కటక్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలవుతుంది. 
 
కాగా, స్టాండింగ్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు ఇదే తొలి సిరీస్ విజయం. అలాగే, వరుసగా భారత్ సాధించిన వన్డే దైపాక్షిక సిరీస్ విజయాల సంఖ్య 8కి చేరింది. ఇకపోతే, ఈ యేడాది వన్డేల్లో భారత్ బ్యాట్స్‌మన్ సాధించిన శతకాల సంఖ్య 19గా ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో దక్షిణాఫ్రికా (18) రికార్డును భారత్ అధిగమించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలెట్స్ వీడియోను తిలకించండి. 
 
సంక్షిప్త స్కోరు 
శ్రీలంక 215 ఆలౌట్ 
భారత్ 219/2