శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (12:32 IST)

చెన్నైకి ఏమైంది..? ఆ పట్టికలో చివరి స్థానం..? అది జరిగితే ధోనీసేనకు..?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఏదో అయ్యింది. లేకుంటే ఐపీఎల్‌ 2020లో ధీటుగా రాణించలేకపోయింది. అంతేగాకుండా ఐపీఎల్‌లోనే అత్యంత పేలవమైన ప్రదర్శన ఇచ్చింది మాత్రం అక్టోబర్ 23న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే. ఇంత చెత్తగా చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ఆడలేదని సోషల్ మీడియాలో ఆ జట్టు అభిమానులు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
మూడుసార్లు ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన ధోనీ సేనకు ఏమైందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్లే ఆఫ్స్‌కు దాదాపుగా దూరమైన సీఎస్‌కే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మళ్లీ రేసులోకి వచ్చే ఛాన్స్ లేదు.
 
ఐపీఎల్ 13వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు అత్యంత చేదు అనుభవాలను మిగిల్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన ధోనీ సేన ఇప్పుడు ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు కూడా దాదాపు మూసుకుపోయాయి. గత మూడు మ్యాచులు ధోనీ సేనకు డూ ఆర్ డై సిచ్యువేషన్‌ను క్రియేట్ చేశాయి. అయినప్పటికీ మూడింటిలో ఒక్కటి కూడా గెలవలేక పోయింది. దీంతో ఆడిన 11 మ్యాచుల్లో మూడు మ్యాచులు ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. 
 
చెన్నై సూపర్‌కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరే దారులు దాదాపుగా మూసుకుపోయినప్పటికీ కొన్ని గణాంకాల్లో మార్పులు వస్తే అవకాశాలుంటాయి. ఇక వచ్చే గేమ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ధోనీ సేన తలపడనుంది. అయితే మిగతా జట్ల ప్రదర్శనపైనే చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. 
 
ఇక సూపర్ కింగ్స్ టాప్‌-4కు చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లతో ఆడే మ్యాచుల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. అది కూడా ఇతర జట్ల కంటే మెరుగైన రన్‌రేట్‌‌తో ధోనీ సేన విజయం సాధించాల్సి ఉంటుంది.