శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (15:07 IST)

చెన్నైలో ఐపీఎల్ మినీ వేలం... బీసీసీఐ

ఎంతో ప్రజాధారణ పొందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 14వ సీజన్‌ కోసం మినీ ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న చెన్నైలో జరుగుతుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌లు జరిగే వేదిక, తేదీలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది సీజన్‌ ఏప్రిల్‌-మే నెలల్లో జరగనుందని తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో జనవరి 20తోనే ఐపీఎల్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా ఆయా ఫ్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను కూడా వదులుకున్నాయి. జట్ల మధ్య ప్లేయర్ల ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4న ముగియనుంది. 
 
మొత్తం 139 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు అట్టిపెట్టుకోగా 57 మందిని వేలంలోకి విడిచిపెట్టారు. ఈ 57 మందిని ఎంపిక చేసుకునేందుకు ఈ మినీ పాటలను నిర్వహించనున్నారు. కాగా, గత 2020 ఎడిషన్‌ పూర్తిగా యూఏఈలోనే జరిగిన విషయం తెలిసిందే.