గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (08:30 IST)

లక్నో అదుర్స్ - చతికిలపడిన పంజాబ్ కింగ్స్

lucknow
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అదేసమయంలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టు చతికిలకపడింది. దీంతో రాహుల్ సేన 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, పంజాబ్ జట్టు ఐదో ఓటమిని చవిచూసింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు రబడ బంతితో నిప్పులు చెరగడంతో పరుగులు చేయలేక వికెట్లను సమర్పించుకుంది. అయితే, డికాక్ 46, దీపక్ హుడా 34 పరుుగలతో రాణించారు. చివర్లో చమీర 17, మోసిన్ ఖాన్ 13 పరుగులు చేయడంతో లక్నో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. పంజాబ్ బౌలర్లలో రబడ 4 వికెట్లు తీయగా, చాహర్ 2, సందీప్ శర్మ 1 చొప్పున వికెట్ తీశారు. 
 
ఆ తర్వాత 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు కేవలం 113 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్నో బౌలర్లు పంజాబ్ ఆటగాళ్లను బాగా కట్టిడి చేశారు. ఫలితంగా ఏ ఒక్క ఆటగాడు క్రీజ్‌లో కుదురుగా కోలుకోలేక పోయారు. 
 
పంజాబ్ జట్టులో బెయిర్ స్టో చేసిన 32 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 25, రిషి ధావన్ 21, లియామ్ లివింగ్ స్టోన్ 18 చొప్పున పరుగులు చేయగా, ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి విజయానికి మరో 21 పరుగుల దూరంలో వచ్చి ఆగిపోయింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 3, దుష్మంత చమీర, కృనాల్ పాండ్యలు చెరో రెండు వికెట్లు తీశారు.