గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (17:29 IST)

పఠాన్‌ ఝూమ్ జో పాటకు డ్యాన్స్ చేసిన కోహ్లీ, జడేజా

Kohli Jadeja dance
Kohli Jadeja dance
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసిన తర్వాత విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా జూమ్ పఠాన్‌ పాటకు డ్యాన్స్ చేశారు. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఏడు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ మైదానంలో అద్భుతమైన పునరాగమనం చేశాడు. 
 
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన షారుఖ్ ఖాన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పఠాన్‌లోని హిట్ పాట ఝూమ్ జో పఠాన్. ఈ చిత్రం మళ్లీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గత ఏడాది బాలీవుడ్‌లోని టాప్‌ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టించింది. 
 
షారుఖ్ ఖాన్ మూడేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం తదితరులు నటించిన ఈ సినిమా సినీ ప్రేమికులకు బిగ్ ట్రీట్ ఇచ్చింది.