1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (15:22 IST)

ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ.. దక్షిణాఫ్రికా నుంచి కోహ్లీ తిరిగొచ్చాడు..

Kohli
కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత్ దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు భారత్ టెస్టు సిరీస్‌ను ప్రారంభించాల్సి ఉంది. దీనికి ముందు విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరంతా ఈ టెస్టు సిరీస్‌లో జట్టులో ఉన్నారు.
 
ఇంతలో, విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగి రావడం జట్టుకు దెబ్బే. కోహ్లీ కంటే ముందు మహ్మద్ షమీ పూర్తిగా ఫిట్‌గా లేనందున టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కోహ్లి భారత్‌కు తిరిగొచ్చాడు. ఇటీవలే టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కోహ్లి.. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. 
 
అయితే అతని గురించి ఎలాంటి అధికారిక అప్ డేట్ కానీ, స్పష్టమైన సమాచారం కానీ బయటకు రాలేదు. డిసెంబర్ 26న సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం అతను జోహన్నెస్‌బర్గ్‌కు తిరిగి వస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
 
మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో వుండడని తెలుస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ నుండి అనుమతి తీసుకున్న తర్వాత కోహ్లీ మూడు రోజుల క్రితం ముంబైకి బయలుదేరినట్లు తెలుస్తోంది.