మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (15:10 IST)

కృనాల్ పాండ్యా ట్విట్టర్ ఖాతా హ్యాక్

బిట్‌కాయిన్ స్కామర్లు ఇప్పటికే పలువురి ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేశారు. ఇలాంటి మోసాల కోసం ఇప్పటికే వందల్లో హై ప్రొఫైల్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేయబడ్డాయి. తాజాగా హార్దిక్ పాండ్యా సోదరుడు క్రికెటర్ కృనాల్ పాండ్యా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. అతని ఖాతాలో బిట్‌కాయిన్ స్కామర్ ట్వీట్ కనిపిస్తోంది. హ్యాకర్లు కృనాల్ ఖాతా నుంచి చాలా ట్వీట్లు చేశారు."బిట్‌కాయిన్‌ల కోసం ఈ ఖాతాను విక్రయిస్తున్నా'' అని ట్వీట్‌ చేశారు.  
 
భారత్‌లోని పలువురు ప్రముఖుల అకౌంట్లను హ్యాక్ చేసిన కేటు గాళ్ళు.. బిట్ కాయిన్‌ను కొనుక్కోవాలంటూ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని పలువురు నిపుణులు తెలిపారు. ఇక భారత్ తరఫున కృనాల్ ఇప్పటి వరకు ఐదు వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.