శుక్రవారం, 28 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (11:36 IST)

గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం- తప్పిస్తే.. క్రికెట్‌పై దృష్టి సారిస్తా

బీజేపీ నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ప్రకటించారు. బీజేపీ వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు. 
 
పార్టీ బాధ్యతలు తప్పిస్తే తాను వచ్చే క్రికెట్ టోర్నమెంట్లపై దృష్టిసారిస్తానని చెబుతున్నారు. మరికొద్దీ రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవనుంది. ఈ క్రమంలో రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గౌతమ్ గంభీర్ కోరారు.
 
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఢిల్లీ తూర్పు లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం కలిగిందన్నాడు. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు అని ఎక్స్‌లో గంభీర్ రాసుకొచ్చారు.