సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (10:53 IST)

నేపియర్ వన్డే : భారత బౌలర్ల ధాటికి 157 పరుగలకే ఆలౌట్

నేపియర్ వన్డేలో భారత బౌలర్లు జూలు విదిల్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ దెబ్బకు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కేవలం 157 పరుగులకే ఆలౌట్ అయింది. కీవీస్ జట్టును తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. ముఖ్యంగా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ కీలకమైన మూడు వికెట్లు, చాహాల్ 2, జాదవ్‌ ఒక వికెట్ చొప్పున తీశాడు. ఫలితంగా కివీస్ జట్టు 157 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టును ఆరంభంలోనే షమీ దెబ్బతీశాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (64) ఒక్కడే అర్థశతకంతో రాణించగా, రాస్ టేలర్ (24) పరుగులు చేశాడు. స్టార్ ప్లేయర్స్ మార్టిన్ గుప్తిల్ (5), మున్రో (8), టామ్ లాథమ్ (11), హెన్రీ నికోల్స్ (12) నిరాశపరిచారు. 
 
పైగా, సొంత గడ్డపై గొప్ప రికార్డు కలిగిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కివీస్ జట్టు కేవలం 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌట్ అయింది. నిజానికి 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది.