శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (11:04 IST)

ఆసియా కప్‌: పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్

Hong kong_pakistan
Hong kong_pakistan
ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో హాంకాంగ్ ఓడిపోయింది. 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్ చిగురుటాకులా వణికింది. 
 
పాకిస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హాంకాంగ్ 10.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్ అయింది. హాంకాంగ్ బ్యాటర్లలో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కాగా, కెప్టెన్ నిజాకత్ ఖాన్ చేసిన 8 పరుగులే అత్యధికం కావడం గమనార్హం.
 
నిజానికి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. చివరి వరకు పోరాడింది. ఒక దశలో విజయం దోబూచులాడింది. దీంతో పాకిస్థాన్‌-హాంకాంగ్ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. అయితే, హాంకాంగ్‌ను ఏ దశలోనూ కుదురుకోనివ్వని పాకిస్థాన్ ఘన విజయం సాధించి సూపర్-4కు దూసుకెళ్లింది. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ 57 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 78 పరుగులు చేశాడు. ఫకర్ జమాన్ 53, ఖుష్‌దిల్ 35 (నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజం 9 పరుగులు చేశారు. 
 
బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన రిజ్వాన్‌కు "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" అవార్డు లభించింది. ఈ విజయంతో సూపర్-4లోకి ప్రవేశించిన పాకిస్థాన్ రేపు మరోమారు భారత్‌ను ఢీకొంటుంది.