మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (11:43 IST)

13 యేళ్ల బుడ్డోడిని కొనుగోలు చేసిన ఆర్ఆర్.. కారణం వివరించిన రాహుల్ ద్రవిడ్!

Vaibhav Suryavanshi
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం పాటల్లో వైభవ్‌ రఘవంశీ అనే 13 యేళ్ళ యువ క్రికెటర్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ కుర్రోడి కోసం ఆర్ఆర్ యాజమాన్యం రూ.1.10 కోట్ల మేరకు ఖర్చు చేసింది. దీనిపై ఆ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. 
 
ఈ వేలం పాటల్లో సూర్యవంశీ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంకు రాగా, ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని తీసుకునేందుకు తొలుత ఆసక్తికనబర్చింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు తీసుకుంది. వైభవ్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడు. ప్రస్తుతం ఈ యువకుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. 
 
కాగా, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అతన్ని తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించాడు. వైభవ్‌లో మంచి నైపుణ్యం ఉందని, ట్రయల్స్ కోసం వచ్చిన అతన్ని చూడడం ఆనందంగా ఉందన్నాడు. ట్రయల్స్‌లో అతని చక్కటి బ్యాటింగ్ నైపుణ్యం తనను ఆకట్టుకుందన్నాడు. రాబోయే సీజన్‌లో జట్టును గెలిపించే సత్తా ఆ కుర్రాడిలో ఉందని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.
 
ఇక 13 ఏళ్ల వైభవ్ ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. కేవలం 62 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. ఈ ప్రతిభే అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.