మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (13:44 IST)

సెహ్వాగ్ చమత్కారం.. పాట్ కమిన్స్ వడ పావ్ ట్వీట్ వైరల్

Virender Sehwag
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటాడనే సంగతి తెలిసిందే. తన చమత్కారంతో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. ఐపీఎల్‌ 2022లో భాగంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత సెహ్వాగ్ పాట్ కమిన్స్  గురించి ట్వీట్ చేశాడు.
 
ముంబై ఇండియన్స్‌పై పాట్ కమిన్స్ 15 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. 373 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 19 నిమిషాల్లో కమిన్స్ సునామీ సృష్టించాడు. 
 
ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత, వీరేంద్ర సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. ' నోటి వడ పావ్‌ను లాగేసుకున్నట్లు ప్యాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ను లాగేసుకున్నాడని ట్వీట్ చేశాడు. పాట్ కమ్మిన్స్, క్లీన్ హిట్టింగ్ అత్యంత అద్భుత ప్రదర్శనల్లో ఒటిగా నిలిస్తుందన్నారు. చివరగా రోహిత్ అభిమానుల కంటే అతని బ్యాటింగ్‌కి పెద్ద నేను అభిమాని అని చెప్పాడు.
 
ప్యాట్‌ కమిన్స్‌పై కోల్‌కత్తా జట్టు యజమాని షారుఖ్‌ ఖాన్‌తో పాటు పలువురు మాజీలు పొగడ్తల వర్షం కురిపించారు.