మంగళవారం, 20 జనవరి 2026
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 29 మార్చి 2022 (23:19 IST)

వేసవిలో చల్లచల్లని లస్సీ.. ఎలా తయారుచేయాలి?

పావు టీ స్పూన్ యాలక్కాయలు, కొద్దిగా కుంకుమపువ్వు కేశాలు, మూడు స్పూన్‌ల వేడినీటిలో పది నిముషాల పాటు కలగలపాలి. ఇప్పుడు రెండు కప్పుల సాదా పెరుగు, రెండు కప్పుల చల్లటినీరు, రెండు టేబుల్ స్పూన్లు పంచదార దీనికి కలిపి, మృదువుగా తయారయ్యేంతవరకు గిలకొట్టాలి.

 
ఇక లస్సీ సిద్ధం. నాలుగుసార్లు తాగడానికి సరిపోతుంది. దీన్ని మూతపెట్టి, పరిశుద్ధమైన ప్రదేశంలో వుంచుకుని అవసరమైనపుడు తనివితీరా హాయిగా సేవించొచ్చు. ఇది, ఆరోగ్యానికి కూడా మంచిది.