బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (21:48 IST)

వేసవిలో మెంతిపొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే?

వేసవిలో మెంతిపొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే చలువ చేస్తుంది. శరీరంలో ఉష్ణం తగ్గుతుంది. అయితే మోతాదుకు మించి తీసుకోకూడదు. అలాగే మెంతిపొడిని రోజు 2 స్పూన్లు పాలల్లో గాని లేదా నీళ్లల్లో గాని కలిపి తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
 
కొలెస్ట్రాల్ తో బాధపడే వారు రోజు కు 10 నుండి 20 గ్రాముల మెంతులుని నీళ్లకు లేదా మజ్జిగకు కలిపి తీసుకుంటే ప్రమాదకరమైన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెంతులు పేగుల వాపును తగ్గిస్తుంది. మెంతు లోని చేదు తత్వాన్ని కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి.
 
అలాగే సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. తలలో చుండ్రును తగ్గించడానికి మెంతులు సహాయపడతాయి. కిడ్నీ, మూత్రాశయ వ్యాధులకు మెంతులు దివ్య ఔషధం. కడుపు నొప్పిని తగ్గించే గుణం మెంతులకు ఉంటుంది.
 
మెంతులని నీళ్లతో కలిపి పైపూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీముపొక్కులు, ఎముకలు విరగడం, కీళ్ల వాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి. మెంతులతో తయారు చేసిన తేనీరు తీసుకోవడం వాళ్ళ శ్వాస సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.